మన దేశాన్ని సైన్స్ రంగంలో ముందుకు నడిపించిన శాస్త్రవేత్తలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
*సర్ సివి రామన్:
ఈయన పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్.1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు.ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్త పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించారు.కాంతి వర్ణాల మీద ఆయన చేసిన ప్రయోగాలు కొత్త ఒరవడికి నాంది పలికాయి.నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త.
*విక్రమ్ సారాబాయ్:
భారతదేశ అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆధ్యుడు.1919 ఆగష్టు 12న గుజరాత్ రాష్ట్రంలో అహమ్మదాబాద్ లో జన్మించారు.
గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించిన వ్యక్తి.అప్పటి ప్రధాని నెహ్రూ కి శాటిలైట్ యొక్క ఉపయోగాలు చెప్పి ఇస్రోని స్థాపించారు.
*హోమీ బాబా:
హోమీ బాబా 1909 అక్టోబర్ 30న ముంబైలో జన్మించారు.టాటా ఇనిస్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్ ని స్థాపించి ఆటామిక్ ఎనర్జీ పరిశోధనలకు మార్గదర్శకుడిగా నిలిచారు.తొలిసారి సైంటిఫిక్ పేపర్ ని నడిపిన శాస్త్రవేత్త.
*అబ్దుల్ కలాం:
ఈయన పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ కలామ్.అక్టోబర్ 15 1931న తమిళనాడు రాష్ట్రంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించాడు.మన దేశ మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.2002 జూలై 18న కలామ్ 90%పైగా ఓట్లతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై అదే నెల 25న పదవీస్వీకారం చేసారు.
*విశ్వేశ్వరయ్య:
1860న బెంగళూరులోని ఒక పేద కుటుంబంలో జన్మించారు.ఈయన అపర భగీరధుడిగా నవ భారత నిర్మాతగా పేరు సాదించారు.
విశ్వ విఖ్యాత ఇంజనీర్ గా,పాలనాదక్షునిగా పిలవబడతారు.ఈయన సేవలకు భారతరత్న కూడా ఇచ్చారు.
*సీఎన్ రావు:
సీఎన్ రావు పూర్తి పేరు చింతామణి నాగేశ్వర రామచంద్రరావు.జూన్ 30 1934న బెంగళూరులో జన్మించారు.రసాయన శాస్త్రంలో ఎన్నో పరిశోధనలను వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి తెలియజేసారు.60 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్న విజ్ఞాన శాస్త్రవేత్త.