మహారాష్ట్రలో ఒక చక్కెర కర్మాగారం ఉంది.దీని పేరు గంగఖేడ్ సుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్.దీనికి త్నాకర్ గుత్తే ప్రమోటర్ గా వ్యవరిస్తున్నారు.ఈ కంపెనీకి చుట్టుపక్కల ఉన్న రైతులు ఎక్కువగా చేరుకునే పండిస్తారు అయితే ఈ పంట మొత్తాన్ని రైతుల నుండి ఈ కంపెనీ కొనుగోలు చేస్తుంది.ఈ విధంగా కొనుగోలు చేస్తూ సుమారు 600మంది రైతుల భూ వివరాలు సేకరించడమే కాకుండా వారికి తెలియకుండా వాటిని పంట, రవాణా పథకం కింద బ్యాంకుల్లో తనఖాపెట్టి ఏకంగా 5,400 కోట్ల రుణం తీసుకుంది.కట్ చేస్తే ఇప్పుడు ఆ రైతులకు రూ.25 లక్షలు బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకుల నుండి నోటీసులు రావడంతో ఏమ్ చెయ్యాలో అర్ధంకాని స్థితిలో పడ్డారు.ఈ మేరకు రైతులు పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇది భారీ కుంభకోణమని తేలింది.దీంతో రంగంలోకి దిగిన ఎంఫోర్సుమేంట్ అధికారులు ఒక్కోకటికి పరిశీలిస్తున్నారు.
