ఆమె విడాకుల ఖరీదు అక్షరాల ఒకటి కాదు రెండు కాదు మూడు లక్షలు కాదు.. కోట్లు అంతకంటే కాదు.. ఏకంగా 2.62లక్షల కోట్లు. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. అసలు విషయానికి వస్తే ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ అయిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన భార్య మెక్ కెంజీతో ఉన్న ఒప్పందం ఈ వారంలో ముగియనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మెక్ తన సతీమణితో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలలో తన సతీమణితో విడాకులు తీసుకోవాలంటే 2.62లక్షల కోట్ల భరణం చెల్లించాలని ఒప్పందం చేసుకున్న సంగతి తెల్సిందే. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం విడాకుల రూపంలో ముగియనున్న నేపథ్యంలో అమెజాన్ అధినేత అంతమొత్తంలో సొమ్మును చెల్లించాల్సి ఉంది. దీంతో అయితే స్వతహాగా రచయిత అయిన మెక్ కెంజీ ప్రపంచంలోనే నాలుగో అత్యంత ధనిక మహిళగా మారారు.అమెజాన్ ప్రారంభించడానికి ముందే అంటే 1993లోనే వీరిద్దరికి వివాహాం జరిగింది. ఈ దంపతులకు నలుగురు పిల్లలున్నారు..
