బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. ఆసుపత్రి వద్దకు బిజెపి అగ్రనేతలంతా చేరుకుంటున్నారు. ప్రజలు, అభిమానుల దర్శనార్థం జైట్లీ పార్థివదేహాన్ని కైలాశ్ కాలనీలో నివాసం వద్ద భౌతికకాయాన్ని ఉంచనున్నారు. రేపు ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ పార్థివదేహాన్ని తీసుకెళ్తారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించనున్నాయి. అనంతరం అక్కడి నుంచి నిగమ్ బోధ్ ఘాట్ కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అరుణ్ జైట్లీ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు.. జైట్లీ మరణం నేపథ్యంలో బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది
