దాయది దేశమైన పాకిస్థాన్ కు భారత్ బుద్ధి చెప్పింది. నిత్యం పలు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి లబ్ధి పొందాలనుకునే పాకిస్థాన్ కు భారత్ దిమ్మతిరిగేలా షాకిస్తూ బుద్ధి చెప్పింది. తాజాగా జరిగిన యూఎన్ఓ సమావేశంలో కశ్మీర్ లోని మహిళల హక్కుల్ని భారత్ కాలరాస్తోందని పాకిస్థాన్ రాయబారి మలీహా లోదీ ఆరోపించారు. దీనికి బదులుగా భారత రాయబారి పలోమి త్రిపాఠి మాట్లాడుతూ” మహిళలకు విలువ ఇవ్వకుండా అంక్షలు విధించింది మీరు. మహిళలను కేవల ఆటబొమ్మలుగా భావించి.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం కూడా భారత్ ను విమర్శిస్తుందని “పాక్ రాయబారి వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
