అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా వివాదస్పదమైన అయోధ్య స్థలం అయోధ్య ట్రస్టుకు ఇవ్వాలని సూచించింది. అంతేకాకుండా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదేకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ నమునా ప్రకారమైతే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అదేళ్లు పడుతుందని టెంపుల్ వర్క్ షాప్ ప్రతినిధి అన్నుభాయ్ సోమ్ పురా వెల్లడించారు. వీహెచ్పీ సూచించిన నమూనాలో నిర్మాణం జరగాలంటే రెండు వందల యాబై మంది నిపుణులు విరామం లేకుండా శ్రమిస్తే ఐదేళ్లలో ఆలయం నిర్మించవచ్చు సోమ్ పురా అన్నారు.
