ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మహిళపట్ల కొందరు మానవ మృగాలు విరుచుకుపడుతున్నారు. అలాంటివారి పట్ల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మొన్న జరిగిన దిశ సంఘటన విషయానికి వస్తే వారిని ఎన్కౌంటర్ కూడా చేసారు. అయితే ఇక దేశ రాజధానిలో చూసుకుంటే మహిళల విషయంలో పోలీసులు వారి రక్షణ కొరకు కొత్త రూల్స్ పెట్టారు. కార్పోరేట్ కంపెనీలలో నైట్ షిఫ్ట్ లు కూడా ఉంటాయి. అయితే అలాంటివారికి ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చెయ్యాలని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే మహిళల రక్షణ విషయంలో పోలీసులకు కంప్లైంట్ చేసిన పట్టించుకోవడం లేదని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ చెప్పుకొచ్చారు. ఇలాంటి తప్పిదాలు దేశ రాజధానిలో సైతం జరిగితే కష్టమేనని చెప్పాలి.
