డిగ్రీ చదవాలని అనుకునేవారికి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇక నుండి సరికొత్త విద్యా విధానం ద్వారా డిగ్రీ ఆన్ లైన్లో కూడా చదువుకునే అవకాశం కల్పించబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటించారు.దేశంలో ముందంజలో ఉన్న మొత్తం వంద జాతీయ విద్యాలయాల్లో ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు ఆమె అన్నారు.అంతేకాకుండా దేశంలో నేషనల్ పోలీస్ యూనివర్సీటీ,నేషనల్ ఫోరెనిక్స్ యూనివర్సిటీను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
