కరోనా కారణంగా పేటిఎమ్ కంపెనీలో ఉద్యోగి ఒకరు సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. మరొక వ్యాపారవేత్త వైరస్ బారిన పడిన కేసు తాజాగా గురువారం బయటపడింది, దాంతో ఢిల్లీలో కార్పొరేట్లు భయంకరమైన కరోనా వైరస్ను అరికట్టడానికి అపూర్వమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. అంతేకాకుండా అక్కడే ఉన్న కాగ్నిజెంట్, విప్రో, పేటీఎమ్ వంటి కంపెనీలు రాత్రికి రాత్రే వర్క్ ప్రాసెస్ ను మార్చేసారు. ఇంటిదగ్గర నుండి వర్క్ చెయ్యమని ఆదేశించారు. ఇటీవలే ఇటలీని సందర్శించిన ఉద్యోగులలో ఒకరు కరోనా వైరస్ సోకిందని తెలియడంతో గురుగ్రామ్ మరియు నోయిడాలోని తన కార్యాలయాలను కనీసం రెండు రోజులు మూసివేయాలని పేటీఎమ్ బుధవారం నిర్ణయించింది. బాధిత ఉద్యోగుల బృంద సభ్యులకు వారి ఆరోగ్య పరీక్షలను ఆలస్యం చేయకుండా చేయమని సూచించినట్లు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.
