ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) మన పొరుగు దేశం పాకిస్తాన్‌ను కూడా భయపెడుతోంది. పాకిస్తాన్లో తొలి ‘కరోనా’ మరణం నమోదైంది. కోవిడ్ -19 లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. హఫీజాబాద్‌కు చెందిన అతను ఇటీవలే ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండడంతో ఇరాన్–టాఫ్టాన్ సరిహద్దుల్లో అతడిని రెండు వారాల పాటు క్వారెంటైన్లో ఉంచి చికిత్స అందించారు. అయితే, అతని ఆరోగ్యం క్షీణించడంతో పాకిస్తాన్‌కు తరలించారు. లాహోర్‌లోని మయో ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించగా.. మంగళవారం మృతి చెందారు. కాగా, పాకిస్తాన్లో కరోనా కేసుల సంఖ్య 189కి చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో 7000 మంది మృతి చెందారు. భారత్‌లో ముగ్గురు చనిపోయారు.
