ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా కేసులు నమోదైన సంఖ్య 258కు చేరుకుంది కాగా ఇందులో నలుగురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే మాత్రం మహారాష్ట్రలో ఈ వైరస్ మితిమీరిపోతుంది. ఆ తరువాత లిస్టులో కేరళ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలు ఐన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో 19,3 కేసులు నమోదు అయ్యాయి. ఇండియా మొత్తం మీద 258కేసులు నమోదు కాగా నిన్న ఒక్కరోజే 22 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 28మందికి నయమయింది కాగా నలుగులు చనిపోయారు.
