ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. అయితే ఇండియా ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే లాక్ డౌన్ చేసినప్పటికీ ప్రజలు అంతగా పట్టించుకోకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి అందరికి కొట్టడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కొందరు వినడంలేదు. దాంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ ప్రజలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను వ్యతిరేకిస్తే ఆర్మీ వస్తది వాళ్ళు వస్తే తాట తీస్తారు అని ఆయన అన్నారు.
