ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఒప్పో ముందంజలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు ఎక్కడ చూసినా ఒప్పో బ్రాండ్ నే ఎక్కువ శాతం వినియోగంలో ఉంది. అయితే అసలు విషయానికి వస్తే తాజాగా ఒప్పో మానవత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఈ వైరస్ విపరీతంగా పెరుగుపోతుంది. దాంతో ఎందరో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి అటు పీఎం రిలీఫ్ కు ఇటు రాష్ట్రాలకు వారికి తోచిన సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఒప్పో కూడా ముందుకు వచ్చి కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. అంతేకాకుండా ఒప్పో యూజర్స్ అందరికి ఆన్లైన్ లో 7అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది. అంతేకూండా 24 * 7 అందుబాటులో ఉంటామని చెప్పారు. అంతేకాకుండా మే 31 వరకు అన్ని ప్రొడక్ట్స్ కి వారంటీ పొడిగిస్తామని అన్నారు.
