Home / POLITICS / Cm Jagan : చంద్రబాబుకి అదిరిపొయే కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్… ఇదే కర్మరా బాబు అంటూ !
Governor biswabhusan farewell meet at vizayawada

Cm Jagan : చంద్రబాబుకి అదిరిపొయే కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్… ఇదే కర్మరా బాబు అంటూ !

Cm Jagan : ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరసాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దేశంలో ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలోనే ఆక్వా వర్సిటీలు ఉన్నాయని…  మూడో వర్సిటీ నరసాపురంలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మత్స్యకారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9 హార్బర్లు రాబోతున్నాయని తెలిపారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఆయిల్ డ్రిల్లింగ్ కార్యక్రమాల వలన నష్టపోయిన 20 వేల మంది మత్స్యకారులకు రూ. 108 కోట్లు పరిహారం ఇస్తున్నామని జగన్‌ తెలిపారు. అదే విధంగా ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్‌ లపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తనదైన శైలిలో కౌంటర్‌ లు ఇస్తూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని బాబు ప్రజల్ని బెదిరిస్తున్నాడని… చివరికి కుప్పంలో కూడా గెలవలేననే భయం ఆయన మాటల్లోనూ కనిపిస్తోందని అన్నారు.

అలానే దత్త పుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని… గత ఎన్నికల్లోనే ప్రజలు వారికి బైబై చెప్పారని కౌంటర్ వేశారు. చంద్రబాబు, అతని దత్తపుత్రుడు కలిసి రాజకీయ కుట్రలు చేస్తున్నారని… దత్తపుత్రుడిని, సొంతపుత్రుడుని ప్రజలు ఓడించారని… టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికార కాంక్ష చూసి జనాలు తలలు పట్టుకుని ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారు అని విమర్శించారు. సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat