Home / POLITICS / Politics : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన కేసిఆర్..

Politics : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన కేసిఆర్..

Politics ప్రతీ ఒక్కరూ సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు..

వికలాంగులు ఆత్మన్యూనతకు లోనవకుండా, ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని.. ఆసరా అవసరమైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదనీ.. తెలంగాణ రాష్ట్రం దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసిఆర్ అన్నారు.. ఈ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం అవార్డులు అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. అలాగే దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల శాఖను ప్రత్యేక శాఖగా స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.

అలాగే పింఛన్‌ విషయంలో కూడా తాము వీరి కోసం ఎంతగానో ఆలోచిస్తున్నమో చెప్పుకొచ్చారు.. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ. 500 పెన్షన్‌తో సరిపడితే, స్వరాష్ట్రంలో ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉంటే అంతమందికి రూ.3016 పింఛన్‌ అందిస్తున్నామని చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దివ్యాంగుల కోసం ఉచిత కోచింగ్‌తోపాటు మెటీరియల్, ఉద్యోగ సర్వీసుల్లో ప్రత్యేక అలవెన్సులు, ఎకనామిక్ రిహాబిలిటేషన్ సెంటర్లు, దివ్యాంగుల సలహా మండలి, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు.. అలాగే దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితబంధు పథకాలతోపాటు ఇతర పథకాల్లో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగ నియామకాలలో 4 శాతం రిజర్వేషన్‌ను అమలుచేస్తున్నామని సీఎం అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat