Politics కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారతదేశంలో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజస్థాన్లో పర్యటిస్తున్నారు అలాగే ఈ సందర్భంగా కేంద్రంపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.. ఇలా చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని చైనా ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు..
రాహుల్ గాంధీ భారత్ జూడయాత్రలో భాగంగా రాజస్థాన్లో పర్యటిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు చైనా యుద్ధానికి ప్రయత్నిస్తుందని అయితే ఈ విషయాన్ని కేంద్రం పెద్దగా పట్టించుకోవట్లేదు అని అన్నారు అలాగే డ్రాగన్స్ అయినాను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదని తర్వాత ఈ విషయం పెను ప్రమాదంగా మారనుందని అన్నారు..
భారత్ జోడో యాత్ర భాగంగా రాజస్థాన్‌లోని దౌసాలో రాహుల్‌గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అలాగే చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని చొరబాటు కోసం కాదు. వారి ఆయుధాల సరళి, వాడకం చూస్తే అర్థమవుతోంది.. అది యుద్ధం కోసమేనని. కానీ భారత ప్రభుత్వం వ్యూహాలపై కాదు, సంఘటనలపై పనిచేస్తోంది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. మన సైనికులపై దాడి చేసింది. దీంతో డ్రాగన్‌తో వచ్చే ముప్పు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిజాన్ని దాచేస్తోంది. మోదీ చైనా బెదిరింపులను విస్మరిస్తున్నారు. ఓవైపు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దాడికి సిద్ధమవుతుంటే.. మన ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు అంటూ విమర్శించారు..