Politics ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇందుకోసం మధ్యాహ్నం బడిలో భోజనం దగ్గర నుంచి చదువుకునే పాఠ్యాంశ పుస్తకాల వరకు ఎన్నో మార్పులు చేసింది జగన్ సర్కారు అయితే తాజాగా మరికొన్ని ప్రణాళికలు చేపట్టింది..
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఆంధ్ర విద్యార్థుల కోసం ఎన్నో చేసింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్నం భోజనం పథకాల్లో ఎన్నో మార్పులు చేసింది అలాగే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటూ పని మార్పులు చేసిన జగన్ సర్కార్ పాఠ్యాంశం పుస్తకాల విషయంలో కూడా ఎన్నో మార్పులు చేశారు అలాగే తాజాగా జరిగిన సమావేశాల్లో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ను కూడా తీసుకొచ్చింది జగన్ సర్కారం. దీన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలో వచ్చే ఏడాది నుంచి బోధించడం ఉన్నట్టు కూడా తెలిపింది..
అయితే అలాగే ఈ క్రమంలోనే మరో నిర్ణయాన్ని కూడా తీసుకుంది జగన్ సర్కార్ ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది ఈ మేరకు శనివారం జరిగిన కార్యక్రమంలో ఉత్తర్వులు జారీ చేసింది 2023 24 విద్యాసంస్థల నుంచి ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు రెండు సెమిస్టర్లు ఉండనుండగా 24 25 విద్యాసంస్థల నుంచి పదవ తరగతిలో కూడా సెమిస్టర్ విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది.. దీనికి సంబంధించిన అన్ని పుస్తకాలను జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు అందించనున్నట్టు జగన్ సర్కార్ తెలిపింది.. అయితే ఇకనుంచి మొత్తం పాఠశాల విద్యా విధానం మారిపోనున్నట్టు తెలుస్తోంది..