Politics జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది అలాగే ఈ క్రమంలోనే ఏపీలో అత్యుత్తమ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ రాబోతున్నట్లు తెలిపింది జగన్ సర్కారు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ ప్రభుత్వం శుభవార్త అందించబోతుంది ఏపీలో అత్యుత్తమ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ లను తీసుకురాబోతుంది. ఈ వ్యాధితో ఏ ఒక్కరూ చనిపోకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది ఆంధ్ర ప్రభుత్వం.. అయితే ఈ మూడు ఆసుపత్రులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏర్పడే నున్నట్టు తెలుస్తోంది అయితే వీటిలో ఒకటి మాత్రం తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది..
అలాగే దేశంలోనే అత్యుత్తమ చికిత్సలు అందించేలా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ హాస్పిటల్ ఏర్పాటు కాబోతున్నట్టు సమాచారం… తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. అలాగే ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయుడు పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ రూపుదిద్దుకోనుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌కల్లా కేన్సర్ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు జరగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో, స్విమ్స్‌కి అనుబంధంగా కేన్సర్ ఆస్పత్రి ఆపరేషన్స్ జరుగుతాయన్నారు వైవీ సుబ్బారెడ్డి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే దసరా రోజు సీఎం జగన్ చేత ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే మిగిలిన రెండో ఆసుపత్రులు ఎక్కడ వస్తాయి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది అయితే సమాచారం ప్రకారం ఒకటి విశాఖపట్నంలో మరొకటి విజయవాడలో ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలో త్వరలోనే జగన్ ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోనిందని ఏది ఏమైనా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి