Political ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారి వైసిపి టిడిపి నాయకులు మధ్య మాటలు యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు..
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.. ఈ సందర్భంగా ఎన్నో వ్యాఖ్యలు చేసిన బొత్స చంద్రబాబు నాయుడు బీసీలను ఉద్ధరించినట్టు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు…
అలాగే ఈ సందర్భంగా మాట్లాడుతూ… అప్పట్లో బాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని గుర్తు చేశారు. బలహీనవర్గాల అభ్యున్నతికి బాటలు వేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని చెప్పారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. అలాగే మళ్ళీ ఆంధ్రాలో టిడిపి వచ్చే అవకాశం లేదని అన్నారు.. టీడీపీ హయాంలో చేసిన ఒక్క మంచి పనినైలా చూపించాలని మంత్రి బొత్స సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఏం చేసిందో క్షేత్రస్థాయిలోకి వస్తే చూపిస్తామని చెప్పారు. అలాగే రోజు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు సాధించేది ఏముందని అన్నారు…
టీడీపీ పాలనలో చక్రం తిప్పింది చుట్టాలు, పట్టాలు మాత్రమే. అమరావతిలో 30 వేల ఎకరాలు దోచుకున్నారు. చంద్రబాబు కళ్లకు అంతా పచ్చగా కనిపిస్తోంది. వారి లాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దోచుకుంటున్నారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ పాలనలో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ఎలా మంత్రులుగా ఉన్నారో తామూ అలాగే మంత్రులం. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు.
– బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మంత్రి