నేచూరల్ స్టార్ హీరో నాని హీరోగా ఇటీవల విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక ప్రచురించిన కథనంపై వివాదం చెలరేగింది. ఓ ట్యాలెంటెడ్ నటిపై ఈవిధమైన బాడీ షేమింగ్ చేయడం పద్ధతి కాదని చాలామంది ఖండించారు.
దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ వార్తలు తనను బాధపెట్టాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఏ మహిళ కూడా బాడీ షేమింగ్‌కు గురికాకూడదని, రూపం, రంగు, శారీరక ఆకృతిపై వివక్ష తగదని హితవు పలికారు.
ఇలా శరీరాలను అవహేళన చేసేవారు ఉద్దేశపూర్వకంగా మహిళలను అధైర్యపరుస్తారని, ప్రగతిని దెబ్బ తీస్తారని వ్యాఖ్యానించారు. మహిళలు అధైర్యపడకుండా తమతమ రంగాల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని గవర్నర్ సూచించారు.