Breaking News
Home / 18+ / పాక్ ప్రధానికి ధీటైన సమాధానం ఇచ్చిన దర్శకుడు..ఎవరో తెలుసా?

పాక్ ప్రధానికి ధీటైన సమాధానం ఇచ్చిన దర్శకుడు..ఎవరో తెలుసా?

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ ప్రస్తుత ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌పై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40 మందికిపైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఘటనపై పాక్ ప్రధాని స్పందింస్తూ..పుల్వామా దాడికి తమకు ఎటువంటి సంబంధం లేదని,సాక్షాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదని,ఎలాంటి సమస్యలైన చర్చలతోనే పరిష్కరించుకోవడం మంచిందని తెలిపారు.

ప్రధాని వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా వర్మ ఘాటుగా స్పందించారు. ‘డియర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌..అని మొదలుపెట్టి చర్చలతోనే సమస్యలు పరిష్కారమైతే.. మీరు మూడు పెళ్లిళ్లు చేసుకునే పనే ఉండదు కదా..ఒకడు ఆర్డీఎక్స్‌ పట్టుకుని మావైపు పరిగెత్తుతుంటే అతడిని ఆపి చర్చలు ఎలా జరపాలో మాకు నేర్పించండి సర్‌…మాకు నేర్పిస్తే ట్యూషన్‌ ఫీజు కూడా చెల్లిస్తాం అంటూ సెటైర్ వేసాడు.మీ దేశంలో ఎవరెవరు ఉంటారో మీకు తెలియదా?ఒసామా బిన్‌లాడెన్‌ ఉన్నాడని అమెరికాకు తెలిసింది,కాని మీకు తెలియదు..మీదీ ఒక దేశమేనా?సర్..జైషే మహమ్మద్‌, లష్కరే, తాలిబన్‌, ఆల్‌ఖైదా సంస్థలు మీ ప్లే స్టేషన్స్‌ కాదని మాకు ఎవ్వరూ చెప్పలేదు,అలాగని వాటికి వ్యతిరేకమని కూడా మీరు ఎప్పుడూ చెప్పలేదన్నారు.సర్ బాంబులు మీకు క్రికెట్‌ బంతుల్లా కనిపిస్తాయా’…అంటూ పాక్‌ ప్రభుత్వాని ఓ ఆట ఆడుకున్నాడు.