Home / 18+ / సరికొత్త ఫీచర్స్ తో రెడ్‌మీ మీముందుకు..!

సరికొత్త ఫీచర్స్ తో రెడ్‌మీ మీముందుకు..!

రెడ్‌మీ..ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమొగిపోతుందని చెప్పాలి.వాళ్ళ బ్రాండ్ వస్తుంటంటే చాలు కళ్ళు మూసి తెరిచేలోపల అన్ని సేల్ అయిపోతాయి.ఇటీవలే రెడ్‌మీ ఒక సరికొత్త ప్రీమియం మొబైల్ రిలీజ్ చేస్తానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం k20, k20 ప్రో పేరిట ఉన్న ఆ ఫోన్ లో చైనాలో హలచల్ చేస్తున్నాయి.ఈ ఫోన్లను ఇండియా మార్కెట్ కు తీసుకొస్తామని ఇటీవలే ఆ సంస్థ ప్రకటన కూడా చేసింది.ఈ మేరకు ట్విట్టర్ పోస్ట్ కూడా చేసారు.జూలై నెలలో ఈ మొబైల్స్ మనకి మనకి అందుబాటులోకి వస్తాయని ఆ కంపెనీ చీఫ్‌ మను కుమార్‌ జైన్‌ ప్రకటించారు.చైనా కన్నా ఇండియాకి వచ్చేసరికి రెట్లు తగ్గుతాయని అందరు భావిస్తున్నారు.ఇక ఫీచర్లు పరంగా చూసుకుంటే..

K20 ఫీచర్లు:
*6.39 అంగుళాల తెర
*స్నాప్‌డ్రాగన్‌ 730 ప్రాసెసర్‌
*20మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా
*48+8+13 ఎంపీ వెనుక కెమెరాలు
*4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
*ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌తో ఈ ఫోన్‌ రానుంది.

K20 ప్రో ఫీచర్లు:
*6.39 అంగుళాల తెర
*స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌
*20మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా
*48+8+13 ఎంపీ వెనుక కెమెరాలు
*4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
*ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేయనుంది