Home / NATIONAL / ఆవులకు గోల్డ్‌ లోన్‌..ఎంతో తెలుసా

ఆవులకు గోల్డ్‌ లోన్‌..ఎంతో తెలుసా

మన ఆవు పాలలో బంగారం ఉందని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి .బెంగాల్‌కు చెందిన దంకుని ప్రాంతంలోని ఓ వ్యక్తి తన రెండు ఆవులను తాకట్టుపెట్టుకుని బంగారంపై రుణం ఇవ్వాలని మణప్పురం ఫైనాన్స్‌కు చెందిన ఓ బ్రాంచ్‌ను సందర్శించారు. తాను గోల్డ్‌ లోన్‌ కోసం తన ఆవులను తీసుకుని ఇక్కడకు వచ్చానని, ఆవు పాలల్లో బంగారం ఉందని తాను విన్నానని, ఈ ఆవులపైనే తాము ఆధారపడ్డామని, వీటిపై తనకు రుణం లభిస్తే తన వ్యాపారాన్ని విస్తరిస్తానని ఆ వ్యక్తి చెప్పకొచ్చారు. మరోవైపు ఘోష్‌ వ్యాఖ్యలను గరల్‌గచా గ్రామ సర్పంచ్‌ మనోజ్‌ సింగ్‌ తీవ్రంగా ఖండించారు. ఘోష్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు రోజూ తన వద్దకు వారి ఆవులతో వచ్చి తమ ఆవులపై ఎంత రుణం ఇస్తారని అడుగుతున్నారని చెప్పారు. ఆవు పాలల్లో బంగారం ఉందని చెప్పిన దిలీప్‌ ఘోష్‌కు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. బుర్ధ్వాన్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ ఘోష్ తన సిద్ధాంతం వెనుక గల కారణాన్ని విశ్లేషించారు. “భారతీయ ఆవులకు మూపురాలు ఉన్నాయి, అవి విదేశీ ఆవులకు లేవు. మూపురం ధమని ఉంది..దీన్ని బంగారు ధమని అని పిలుస్తారు. సూర్యరశ్మి దానిపై పడినప్పుడు బంగారం తయారవుతుందని చెప్పుకొచ్చారు.