Home / CRIME / నిర్భయ నిందితులకు ఉరేనా..? బక్సార్ జైలులో ఉరితాళ్లు సిద్ధం చేస్తున్నారా..?

నిర్భయ నిందితులకు ఉరేనా..? బక్సార్ జైలులో ఉరితాళ్లు సిద్ధం చేస్తున్నారా..?

యావత్ భారతావనిని కదిలించింది నిర్భయ ఘటన.. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో దేశంమొత్తాన్ని భయబ్రాంతులకు గురిచేసింది. కదులుతున్న బస్సులో వైద్యవిద్యార్ధిని అత్యంత కర్కశంగా రేప్ చేసి బయటకు విసిరేశారు దుర్మార్గులు. అత్యంత దారుణంగా జరిగిన ఈ అమానుష దాడిలో నిర్భయ 13రోజుల పాటు చావుతో పోరాడి చనిపోయింది. నిర్భయ ఘటనలో 6 గురు దోషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మేజర్లు, ఒకరు మైనర్.. వీరికి 2013 సెప్టెంబర్ 13న ఢిల్లీ కోర్టు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అయినా వారికి ఇంతవరకూ ఉరిశిక్ష అమలు కాలేదు. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు గడిచినా దోషులకు ఉరి విధించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ లో డాక్టర్ దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను రీ క్రియేషన్ లో పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా మహిళలు సంబరాలు చేసుకున్నారు. ఇదే సందర్భంలో నిర్బయ నిందితులను ఉరి తీయాలంటూ నిర్భయ తల్లి కూడా బహిరంగంగానే ప్రశ్నించింది. నిర్భయకు ఇంతవరకూ న్యాయం జరగలేదంటూ నిర్భయ తల్లి ఆందోళన వ్యక్తం చేసింది.

 

 

ఉరి తీయాడానికి తలారీ లేడంటు ఇటీవల తీహార్ జైలు అదికారులు తెలిపారు. నిందితులకు ఉరి వేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా వారికి ఉరిశిక్ష అమలు కాకపోవడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రంపై కూడా ఒత్తిడి పెరగడంతో నిర్భయ నిందితులను త్వరలోనే ఉరి తీస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే ఈ వాదనకు మరింత బలం చేకూర్చేలా బీహార్ బక్సార్ జైలులో ఉరితాళ్లను సిద్దం చేస్తున్నారని సమాచారం. త్వరలోనే నలుగురు నిర్భయ నిందితులను ఉరి తీయచ్చని అధికారులు సంకేతాలిస్తున్నారు. అదే జరిగితే దేశవ్యాప్తంగా మరోసారి మహిళలు సంబరాలు చేసుకుంటారని అర్ధమవుతోంది.