ఓ మహిళ తన ఫ్లాట్‌లోని బాత్‌రూంలో స్నానం చేస్తుండగా కుక్ గా పనిచేస్తున్న ఓ యువకుడు తన మొబైల్ ఫోనుతో వీడియో తీసిన దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో సంచలనం రేపింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భాస్కర్ అహ్లాదర్ (28) యువకుడు బెంగళూరు నగరంలోని బెల్లందర్ అపార్టుమెంటులో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఓ మహిళ తన ఫ్లాట్‌లోని బాత్‌రూంలో స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి ఎవరో మొబైల్ ఫోన్ తో వీడియో తీస్తున్నట్లు కనిపించడంతో స్నానం చేస్తున్న మహిళ కేకలు పెట్టింది. దీంతో ఆ మహిళ భర్త వెళ్లి వీడియో తీస్తున్న వ్యక్తిని పట్టుకోబోగా పారిపోయాడు. దీంతో అపార్టుమెంటు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా కుక్ గా పనిచేస్తున్న భాస్కర్ అహ్లాదర్ తన మొబైల్ ఫోనుతో వీడియో తీశాడని తేలింది. దీంతో కుక్ భాస్కర్ అహ్లాదర్ ను పట్టుకొని అతన్ని పోలీసులకు అప్పగించారు. అతని మొబైల్ ఫోన్ ను పరిశీలించగా బాత్ రూం వీడియో తొలగించి ఉంది. దీంతో పోలీసులు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని దాన్ని సైబర్ నిపుణుల పరిశీలనకు పంపించారు. బాత్ రూం వీడియోను ఎవరికైనా సర్కులేట్ చేశాడా అనే కోణంపై పోలీసులు సైబర్ నిపుణుల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
