తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ప్రజలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీపి కబురు అందించారు.హైదరాబాద్ మహానగరం మల్కాజ్‌గిరిలోని బీజేఆర్ నగర్‌లో బస్తీ దవాఖానను రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా బస్తీ దవాఖానా లో మంత్రి కేటీఆర్ వైద్యం చేపించుకున్నారు.వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. కేటీఆర్‌కు బీపీ చెక్ చేశారు.అనంతరం చేతివేలి గాయానికి మంత్రి కేటీఆర్ చికిత్స చేయించుకున్నారు. బస్తీ దవఖానాల్లో తానే మొదటి రోగిని అని కేటీఆర్ చెప్పి నవ్వులు పూయించారు..
Launched 17 Basthi Dawakhanas in Hyderabad today along with Health Minister Dr. Laxma Reddy Garu. Intent is to take the number to 1,000 (1 per 10,000 population)
Free medicines through embedded Pharmacy & complete Medical support. Also coming soon Telangana diagnostic labs ?? pic.twitter.com/35SiHWC6kn
— KTR (@KTRTRS) April 6, 2018
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.హైదరాబాద్ నగరంలో వెయ్యి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తామన్నారు.. బస్తీ దవాఖానాల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపశమనం కలుగుతుందని… ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నమోదు చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.అనంతరం అధికారులు మాట్లాడుతూ.. నగరంలోని మలక్‌పేటలోని గడ్డిఅన్నారంలో, ఫలక్‌నూమాలోని హష్మాబాద్‌తో పాట పలు ప్రాంతాల్లో బస్తీ దవఖానాలు ప్రారంభమైనట్లు తెలిపారు.