దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఒక పెద్ద చర్చ జరుగుతంది. అది ఏమీటంటే కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారన్న దానిపై. అయితే బీజేపీకి అధికార పీఠం దక్కకుండా చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్ కు బేషరతు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జేడీఎస్ ను చీల్చేందుకు బీజేపీ కూడా తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించింది. కాని కర్ణాటకలో ఇంత జరుగుతుంటే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి ఎక్కడా, ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. కర్ణాటక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన రాహుల్.. కౌంటింగ్ రోజు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాయకత్వ లోపాలపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్.. తన ఖాతాలో మరో ఓటమి నమోదు కావడంతో అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక ఫలితాలపై రాహుల్ ను సంప్రదించేందుకు పలు మీడియా సంస్థలు ప్రయత్నించగా.. ఆయన ఎవరికీ అందుబాటులోకి రాలేదు. మరోపక్క 2019 లో కూడ ఇదే విజయం ఖచ్చితం అంటున్నారు బీజేపి నేతలు
