సిరిసిల్ల నేతన్న మరో అద్భుతమైన చీరెను తయారు చేశాడు.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కి సిరిసిల్ల చేనేత కార్మికుడు ఓ అరుదైన చీరె ను మంగళవారం బహుకరించారు. గతంలో చేనేత కార్మికుడు దివంగత నల్ల పరంధములు అగ్గిపెట్టలో చేనేత చీరెను అమర్చి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయన కొడుకు నల్ల విజయ్ మూడు ఇంచుల దబ్బానంలో దూరే పట్టుచీర ను మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. 2014లో ఈ చీరె ను 15రోజులు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు.ఈ చీరె సుమారు మీటరు వెడల్పు,5.45 మీట్లర్ల పొడవు ఉన్నదని చెప్పారు.రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సాయంతో త్వరలోనే 31 జిల్లాల భౌగోళిక చిత్ర పటం తో ఉన్న చీరెను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.