తమిళనాట పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన యువ నటి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళ్‌లో ‘వంశం’ లాంటి సక్సెస్‌ఫుల్ సీరియల్స్‌తో పాటు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. ఈ రోజు (బుధవారం) వలసరవక్కాం లోని ఆమె ఇంటికి పనిమనిషి వచ్చే సరికి ప్రియాంక విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రియాంక గత మూడు నెలలుగా భర్తకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
