ప్రియాంక చోప్రా సల్మాన్‌ఖాన్‌కు హ్యాండిచ్చింది. అయితే, సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న భారత్ అనే సినిమాలో ప్రియాంక చోప్రాను ఏరి కోరి మరీ హీరోయిన్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. తన మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్‌కు నో చెప్పి మరీ.. ప్రియాంక చోప్రాకు భారీ పారితోషకం ఇచ్చి తీసుకునేలా నిర్మాతలపై ఒత్తిడి తెచ్చాడు సల్మాన్. తీరా షూటింగ్ కొంత భాగం పూర్తయిన తరువాత ఇప్పుడు షూటింగ్ నుంచి తప్పుకుంది ప్రియాంక చోప్రా. ఈ సినిమా చేయలేను అని చెప్పిందట.
కాగా, ప్రియాంక చెప్రా ఆ మాట చెప్పిన మాట నిజమేనని దర్శకుడు అలి అబ్బాస్ ట్వీట్ చేశాడు. భారత్ చిత్రంలో ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకుంటున్నారట. ప్రియాంక చోప్రా తమ చిత్రం నుంచి తప్పుకోవడానికి సరైన రీజన్ ఉందని కూడా దర్శకుడు అలి అబ్బాస్ ట్వీట్ చేశాడు.
ఇక అసలు విషయానికొస్తే.. గత కొన్ని రోజులుగా ప్రియాంక చోప్రా తన బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తెగ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు కూడా గుప్పమన్నాయి. ఆ మాటలనే వాస్తవం చేస్తూ.. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని, ఆ క్రమంలోనే సినిమా నుంచి తప్పుకుందని దర్శకుడు అలి అబ్బాస్ తెలిపాడు.
అమెరికాకు చెందిన పాపులర్ సింగర్ నిక్‌తో ప్రియాంక చోప్రా ఏడాదిగా డేటింగ్ చేస్తోంది. మొదట వీరిద్దరి డేటింగ్ సీరియస్ మేటర్ కాదని అంతా భావించారు. అయితే, ఆమె నిక్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు అర్థమైంది. ఈ క్రమంలోనే నిక్‌తో ప్రియాంక చోప్రా ఎంగేజ్‌మెంట్ కూడా జరుపుకుంది. ఇక వారిద్దరి పెళ్లికి డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉంది ప్రియాంక కుటుంబం. పెళ్లిడేట్ కూడా చాలా త్వరలోనే ఉంటుందని, దీంతో పెళ్లి పనులు ఉండటంతో సల్మాన్ ఖాన్ చిత్రంలో చేయలేనని ప్రియాంక చోప్రా తెగేసి చెప్పింది.