Home / 18+ / ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రధానంగా డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది.

కొత్త నిబంధనలోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, రక్షకుని గురించిన జోస్యాలను అనుసరించి జోసెఫ్, మేరీ బెత్లెహాం వచ్చినప్పుడు వసతి గృహం (ఇన్)లో గదులు లభ్యం కాకపోవడంతో పశువుల పాకలో వారికి ఆశ్రయం దొరుకింది, అక్కడే క్రీస్తు జన్మించాడు దేవదూతలు ఈ విషయాన్ని పశువుల కాపరులకు చెప్పగా, వారు సమాచారం మిగిలినవారికి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ సెలవు రోజు, ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగానూ, క్రైస్తవేతరులు సాంస్కృతికంగానూ జరుపుకుంటారు,పశ్చిమదేశాల్లో సెలవుల సీజన్లో అత్యంత ముఖ్యమైన భాగం.

క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబరు 25 నాటికి నిర్వహించడం సాగించింది, ఇదే తేదీని తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది. ప్రస్తుత కాలంలో క్రైస్తవుల్లో అత్యధికులు గ్రెగోరియన్ కేలండర్లోని డిసెంబరు నెల 25వ తేదీన నిర్వహించుకుంటున్నారు.

ఏదేమైనా కొన్ని తూర్పు క్రైస్తవ చర్చిలు పాత జూలియన్ కేలండర్ ప్రకారమే జూలియన్ డిసెంబరు నెల 25 తేదీన, అంటే ప్రస్తుత గ్రెగోరియన్ కేలండర్లోని జనవరి 6 తేదీన జరుపుకుంటున్నాయి. ఈ తేదీ తర్వాతి రోజునే పశ్చిమ క్రైస్తవ చర్చిలు ఎపిఫనీ అనే పండుగ చేసుకుంటాయి. ఐతే ఇది డిసెంబరు 25 తేదీపైన అనంగీకారం కాదు, డిసెంబరు 25 తేదీని ఏ కాలెండర్ ని అనుసరించి నిర్ణయించాలన్న అంశంపైన తూర్పు క్రైస్తవుల్లో కొందరికి జూలియన్ కాలెండర్ మీదున్న మొగ్గు. పైపెచ్చు క్రైస్తవులు సరిగ్గా ఏ తేదీన జన్మించాడో అదే తేదీన పండుగ చేసుకోవాలన్నది క్రిస్మస్ ప్రధాన కారణం కాదనీ, దేవుడు మానవ రూపంలో మానవ జాతి పాపాలను తొలగించడానికి భూమిపైకి వచ్చాడన్న కారణంగానే క్రిస్మస్ జరుపుకోవాలని, అదే క్రిస్మస్ పండుగకు ప్రధాన ఉద్దేశంగా ఉండాలని సిద్ధాంతం.

వివిధ దేశాల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో కొన్ని క్రైస్తవ పూర్వపు పద్ధతులు, కొన్ని క్రైస్తవ పద్ధతులు, కొన్ని లౌకిక విధానాలు ఉన్నాయి.ఆధునికంగా ప్రసిద్ధి చెందిన వేడుకల్లో బహుమతులు ఇవ్వడం, క్రిస్మస్ కోసం ఎడ్వంట్ కేలెండర్ (డిసెంబర్ 1 నుంచి) లెక్కించడం, ఎడ్వంట్ రెత్ పేరిట ఓ ఆకుపచ్చని ఆకులతో రింగ్ తయారుచేసి నాలుగు కానీ, ఐదు కానీ కొవ్వొత్తులు వెలిగించడం, క్రిస్మస్ సంగీతం, అందులో క్రిస్మస్ కరోల్ అనే గీతాలాపన, క్రిస్టింగల్ అనే కొవ్వొత్తి వెలిగించడం, క్రీస్తు జననం ప్రదర్శనను చూడడం, సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక విందు, క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ దీపాలు, క్రీస్తు జననం దృశ్యాలు, పూల దండలు, వంటివాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు ప్రదర్శించడం వంటివి ఉన్నాయి.

దీనికితోడు ఒకదానికొకటి సన్నిహిత సంబంధం ఉండే శాంతా క్లాజ్, ఫాదర్ క్రిస్మస్, సెయింట్ నికొలస్, క్రైస్ట్ కైండ్ వంటి పాత్రలు పిల్లలకు బహుమతులు తీసుకురావడం వంటి వివిధ సంప్రదాయాలు, జానపద గాథలతో కూడి క్రిస్మస్ సంస్కృతిలో భాగంగా ఉన్నారు.బహుమతులు ఇవ్వడం, అలంకరణలు చేయడం వంటివి ఆర్థిక లావాదేవీలను పెంపొందిస్తాయి కనుక క్రిస్మస్ సెలవులు పలు దేశాల్లో వ్యాపారాలకు, అమ్మకందార్లకు కీలకమైన ఈవెంట్, ముఖ్యమైన వ్యాపార సమయంగా మారింది. క్రిస్మస్ పండుగ ఆర్థిక ప్రభావం గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో స్థిరంగా పెరుగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat