దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్‌ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్ నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడు, పాటలు విన్నప్పుడు సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఓ ఎగై్జట్‌మెంట్ కనిపించింది. అంతేకాదు ఈ సినిమా టిక్కెట్ వేలంలో లక్షల్లో అమ్ముడవడం ఈ సినిమా క్రేజ్ ను చూపిస్తోంది. మరిముఖ్యంగా మమ్ముట్టి చాలా శ్రద్దగా తన సొంత గొంతుతో డైలాగులు చెప్పడం ఈ సినిమా రేంజ్ ను పెంచింది. ఆయన గంభీరమైన స్వరంతో.. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ చెబుతున్న డైలాగులు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. పెద్దగా హడావిడి లేకుండా సైలంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరగడంతో హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విపరీతమైనక అంచనాలతో ఎన్టీఆర్ నిరాశపరచగా.. సైలంట్ గా వచ్చిన యాత్ర హిట్ కొడుతుందన్న టాక్ బాగా వినిపిస్తోంది.
