హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో శనివారం ‘ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎక్స్ పో- 2019’ ను తెలంగాణ శాసనసభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. భారత దేశంలోని వివిధ ప్రదేశాలతో పాటు వివిధ పాశాత్య దేశాల నుంచి విద్యా సంస్థల ప్రతినిధులు ‘అబాకస్ ఓవర్సీస్ ‘ సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పురోగమిస్తోనదని, విద్యా రంగానికి అధిక ప్రాముఖ్యతను కల్పిస్తోందని అన్నారు. పేద విద్యార్ధులు సైతం విదేశాల్లో విద్యాభ్యాసం సాగించేందుకు వీలుగా ప్రభుత్వం కనీ వినీ ఎరుగని పధకాలు, కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రభుత్వ సదుపాయాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. అబాకస్ సంస్థ విదేశీ విద్యాబ్యాసం సాగించేందుకు ఉత్సుకత చూపే వారికి బాసటగా నిలుస్తోందని కితాబునిచ్చారు. 10 దేశాలకు చెందిన 100 విశ్వవిద్యాలయాల ప్రతినిధులను ఒకే వేదిక పైకి చేర్చడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.