ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న అలజడికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన NPR,NRC బిల్లు.
ప్రస్తుతం ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్యమాలు.. పోరటాలు జరుగుతున్నాయి. అయితే అసలు NPR,NRC అంటే ఏమిటి..?. వీటి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసుకుందామా..?.
దేశంలో ఉన్న జనాభాన్ని లెక్కించడాన్ని NPR అని అంటారు. మన దేశంలో గత ఆరు నెలలుగా జీవిస్తున్న విదేశీయుల జాబితాను కూడా ఇందులో లెక్కిస్తారు. దేశంలో అసలు ఎంతమంది నివసిస్తున్నారనేది తెలుసుకోవడమే దీని ప్రధాన ఉద్ధేశ్యం.
ఇక NRC అంటే ఇందులో పేరు నమోదైన వారిని మాత్రమే దేశ పౌరులుగా పరిగణిస్తారు. అయితే ఇందులో పేరు లేని వారిని వెంటనే విదేశీయులుగా ప్రకటించరు. వారు హైకోర్టు,సుప్రీం కోర్టును సంప్రదించి న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది.