ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనాతో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. దాంతో చైనాలో ఉన్నవారు తమ సొంత గూటికి వచ్చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే చైనాలో తయారు చేసే వస్తువులును కొన్ని దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ఇందులో ఇండియా కూడా ఒకటని చెప్పాలి. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చైనా ప్రోడక్ట్ ను భారత్ నిలిపివేసిందని తెలుస్తుంది. దాంతో ఒక్కసారిగా చైనా మార్కెట్ మొత్తం పడిపోయినట్టు తెలుస్తుంది.
