అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం మొదటి సబర్మతి ఆశ్రమం తరువాత క్రికెట్ స్టేడియం కు వెళ్ళడం జరిగింది అనంతరం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించారు. ఇక రెండోరోజు ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ప్రెసిడెంట్ ని కలిసారు. ఇక ట్రంప్ పర్యటనలో భాగంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో విందు నిర్వహించారు. ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ విందుకు ఎఆర్ రెహమాన్ మరియు ఇతరులను కూడా ఆహ్వానించారు. విందులో భాగంగా ఎఆర్ రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో గ్రాండ్ డిన్నర్ యొక్క చిత్రాలను షేర్ చేసాడు. .