Home / Uncategorized / చంద్రబాబుకు డబుల్ షాక్.. వైసీసీలోకి అనంత తల్లీకూతుర్లు..!

చంద్రబాబుకు డబుల్ షాక్.. వైసీసీలోకి అనంత తల్లీకూతుర్లు..!

స్థానిక సంస్థల వేళ టీడీపీ సీనియర్ నేతలంతా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి వైసీపీ గూటిలోకి చేరుకుంటున్నారు. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన నేతలంతా ఇక చంద్రబాబుతో పని చేయలేమంటూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో రాయలసీమలో మొదలైన వలసల పర్వం ఇంకా కొనసాగుతోంది. రేపో మాపో పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరబోతుండగా తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మహిళా నేతలు వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. వారు ఎవరో కాదు శింగనమల టీడీపీ సీనియర్ మహిళా నేత, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినిబాల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో రాయలసీమకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు పెట్టినప్పుడు చంద్రబాబు విప్ జారీ చేసినా ఎమ్మెల్సీ శమంతకమణి అనారోగ్యం వంకతో హాజరు కాలేదు. అంతే కాదు మూడు రాజధానులకు శమంతకమణి మద్దతు పలికారు. ఇక శమంతకమణి కుమార్తె యామినిబాల 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతిపై గెలుపొందారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో యామినిబాల ప్రభుత్వ విప్‌గా పని చేశారు. అయితే 2009 ఎన్నికల్లో యామిని బాల తన ప్రత్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమిపాలయ్యారు. గత కొద్దిరోజులుగా చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ తల్లీ కూతుళ్లు..టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు తమ అనుచరులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఈ సాయంత్రం శమంతకమణి, యామినిబాల సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండురోజుల్లోనే ఈ ఇద్దరు మహిళా నేతలు వైసీపీలో చేరుతున్నట్లు అనంత టీడీపీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా అనంత టీడీపీ తల్లీకూతుర్లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు చంద్రబాబుకు షాకింగ్‌ మారాయి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat