Home / POLITICS / Minister Jogi Ramesh : 2024 ప్రజలు టీడీపీని మళ్ళీ తరిమికొట్టడం ఖాయం : మంత్రి జోగి రమేష్
MINISTER JOGI SHOKING COMMENTS ON CHADRABABU

Minister Jogi Ramesh : 2024 ప్రజలు టీడీపీని మళ్ళీ తరిమికొట్టడం ఖాయం : మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh : పబ్లిక్‌లో పచ్చిగా బూతులు మాట్లాడుతున్న చంద్రబాబుది బూతుల పార్టీ కాక మరి ఏంటని మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ… నరసాపురంలో సీఎం జగన్ మాట్లాడిన మాటలపై టీడీపీ సైకోలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పబ్లిక్ లో పచ్చిగా బూతులు మాట్లాడారు. మరి వారిది తెలుగు బూతుల పార్టీ కాకుండా ఏంటి? అన్నం పెట్టిన తల్లిని, పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ని తన్నించిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తిని ఏ మాటలతో సంబోధించాలి… అని ఎద్దేవా చేశారు.

టీడీపీ బూతులు పార్టీ, జనసేన రౌడీపార్టీ అనేది నిజం కాదా అని మంత్రి నిలదీశారు. టీడీపీ బూతులు పార్టీ, జనసేన రౌడీపార్టీ అనేది నిజమే కదా అని అన్నారు. టీడీపీ చచ్చిపోయిన పార్టీ అని… ఆ పార్టీని పాడె మీద మోసుకుని వెళ్తుంటే దాన్ని రక్షించుకోవడానికి చంద్రబాబు అందరి కాళ్లు నాకుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. బాదుడే బాదుడే కార్యక్రమానికి స్పందనే లేదని వాళ్ల రివ్యూ లోనే తేలిపోయింది. జగన్‌ని ఢీకొట్టాలంటే చంద్రబాబు బలం చాలదు. 2019 ఎన్నికలలో చంద్రబాబుని ప్రజలు చెప్పుతో కొట్టారు. బట్టలు ఊడదీసి కొట్టిస్తానని చంద్రబాబు ఈ వయసులో మాట్లాడుతున్నారు. గత ఎన్నికలలో చంద్రబాబుకు అదే జరిగిందన్న సంగతి మర్చిపోయారా అంటూ కామెంట్ చేశారు.

పప్పు సైకో సైతం జగన్ గురించి కారు కూతలు కూయటం సిగ్గుచేటు. అసలు కుప్పంలో కూడా ఈసారి చంద్రబాబు గెలవడు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే దీనికి రుజువు అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి ఎమ్మెల్యేని ఇంటింటికీ పంపి సమస్యలు తెలుసుకుంటున్న నాయకుడు జగన్ మాత్రమే అని హర్షం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలలో ప్రజలు మళ్ళీ టీడీపీని తరిమి కొట్టడం ఖాయం అని జోగి రమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat