Home / POLITICS / It Raids : మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్..!

It Raids : మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్..!

It Raids : తెలంగాణలో పరిస్థితులు రోజురోజుకి మరింత హీట్ ఎక్కుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లతో పాటు వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 50 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి సమీప బంధవు ఇంట్లో పెద్ద మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలోనూ రూ.2 కోట్లు సీజ్ చేశారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, సికింద్రాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ లోనూ ఐటీ బృందాలు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

అదే విధంగా మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి ఇళ్ల లోనూ సోదాలు చేపట్టారు. అటు మల్లారెడ్డికి అల్లుడు వరుసయ్యే సంతోష్ రెడ్డి ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు. సంతోష్ రెడ్డి ఇంట్లో రూ.4 కోట్ల నగదుతో పాటు పలుకీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఇంట్లోకి వెళ్లడం తోనే సంతోష్ రెడ్డి పలు కీలక డాక్యుమెంట్లను చింపి బాత్రూంలో పడేసినట్లుగా గుర్తించారు. అయితే ఆ చినిగిన డాక్యుమెంట్లను రెట్రివ్ చేశారు ఐటీ అధికారులు. బాత్రూంలో చింపిపడేయడమే కాకుండా కొన్నింటిని కిచెన్లో చించి పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకొని సంతోష్ రెడ్డిని విచారిస్తున్నారు. చూడాలి మరి ఈ విషయం ఏ పరిణామాలకు దారితీస్తుందో అని.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat