Home / POLITICS / Telangana Politics : ముగిసిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ అంత్యక్రియలు… అండగా ఉంటామన్న సీఎం కే‌సి‌ఆర్ !

Telangana Politics : ముగిసిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ అంత్యక్రియలు… అండగా ఉంటామన్న సీఎం కే‌సి‌ఆర్ !

Telangana Politics : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో గిరిజనుల దాడిలో మృతిచెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం ఈర్లపూడిలో ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాస్‌ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కాగా ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గొత్తి కోయలు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ పై గుత్తి కోయలు దాడి చేశారు. తమకు భూములు దక్కకుండా చేస్తున్నారన్న ఆవేశంతో.. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రగాయాలపాలైన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావును ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శ్రీనివాసరావు హత్య పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అధైర్య పడవద్దంటూ భరోసా ఇచ్చారు. అలానే మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్, ఇంద్రకరణ్‌ రెడ్డి ఈర్లపూడికి చేరుకుని శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్ర కిరణ్ రెడ్డి శ్రీనివాస్ రావు పాడే మోశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో స్మశాన వాటికలో శ్రీనివాసరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మూడు రౌండ్స్ గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం శ్రీనివాసరావు చితికి పిల్లలు నిప్పంటించారు.

ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాసరావు కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని భరోసా ఇచ్చారు. అంత్యక్రియల్లో వేలాది మంది స్థానికులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అటవీశాఖ సిబ్బంది భారీగా పాల్గొన్నారు. శ్రీనివాసరావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత నెలకొంది.. తమకు రక్షణ కల్పించాలని ఫారెస్ట్ అధికారులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రుల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు లేకపోవడంతోనే దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino