టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీ20, వన్డేలు, టెస్ట్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు ప్రపంచ కప్ తరువాత ఆడిన మొదటి సిరీస్ ఇదే. అయితే మూడు ఫార్మాట్లో వెస్టిండీస్ ను మట్టికరిపించి ఘనవిజయం సాదించింది. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రా కుర్రాడు హనుమా విహారి.. ఈ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అంతే టెస్టుల్లో స్థానం దక్కించుకున్నాడు. సెలెక్ట్ అయితే సరిపోదు వచ్చిన అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకుంటేనే తనకంటూ మంచి పేరు వస్తుంది. అయితే టీమిండియా వెస్టిండీస్ తో రెండు టెస్టులు ఆడి ఘనవిజయం సాదించడంలో కీలక పాత్ర పోషించాడు విహారి. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిన విహారి రెండో ఇన్నింగ్స్ లో అదే ఆటతో అర్ధ శతకం సాధించి అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం ఈ ఆటగాడు జట్టుకి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు.
