Home / NATIONAL / హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది ..?

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది ..?

దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటి చేస్తున్నాయి .ఈ ఎన్నికలను రానున్న పార్లమెంటు ఎన్నికలకు సెమిఫైనల్ వార్ గా ఇరు పార్టీలు భావిస్తున్నాయి .

ఈ తరుణంలో ఓటర్లు ఎవరివైపు ఉన్నారో కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి .ఈ పోల్స్ లో ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయో ఒక లుక్ వేద్దామా .. రాష్ట్రంలో మొత్తం అరవై ఎనిమిది స్థానాలు ఉన్నాయి .ఇండియా టుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ పార్టీకి నలబై ఏడు స్థానాల నుండి యాబై ఐదు స్థానాలవరకు వస్తాయి .

కాంగ్రెస్ పార్టీకి పదమూడు స్థానాల నుండి ఇరవై స్థానాల వరకు ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుస్తుంది అని తెలిపింది .టైమ్స్ నౌ నిర్వహించిన పోల్స్ లో బీజేపీ పార్టీ యాబై ఒక్కటి ,కాంగ్రెస్ పార్టీ పదహారు ,ఇతరులు ఒక్క స్థానంలో గెలుస్తుంది అని తేల్చేసింది .ఏబీపీ-సీఎస్డీఎస్ నిర్వహించిన పోల్స్ లో బీజేపీ పార్టీకి ముప్పై రెండు నుండి ముప్పై ఎనిమిది మధ్య ,కాంగ్రెస్ పార్టీకి పదహారు నుండి ఇరవై రెండు మధ్య స్థానాలు వస్తాయి అని తేలింది.