అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ అత్యాచారం చేశాడని ఓ మహిళా జాతీయ కమిషన్ (ఎన్సీడబ్ల్యు) తో ఫిర్యాదు చేసింది. 2008 లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు పెమా ఖండు ఆ సమయంలో ముఖ్యమంత్రి కాలేదని తన సహచరులలో ఇద్దరు ముఠా అత్యాచారం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను స్పృహలో లేనని తెలిపింది.
see also…జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం..!
‘ఈ విషయంలో నాకు ఇప్పటివరకు ఎవరి నుంచి ఎలాంటి సాయం అందలేదు. సీఎం నాపై అత్యాచారం చేశాడంటే ప్రజలు కానీ పోలీసులు కానీ నమ్మలేదు. నాపై అత్యాచారం జరిగినప్పుడు ఆయన సీఎం పదవిలో లేడు. ఇప్పుడు ఆయన సీఎం అయ్యేసరికి నా మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు. దాంతో రష్మి భతీ అనే మహిళా న్యాయవాది సాయంతో జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించాను. నాకు ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే నాలాంటి బాధితులు ఇంకెవర్నీ నమ్మలేరు. ఇదంతా నేను పబ్లిసిటీ కోసం చేస్తున్నానని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. పాపులారిటీ కోసం ఇంత నీచానికి దిగజారే మనిషిని కాను. న్యాయం కోసం నా తుదిశ్వాస వరకూ పోరాడుతూనే ఉంటాను.’ అని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.