Breaking News
Home / Uncategorized / భాగ్యనగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి ధర్మ ప్రచారయాత్ర..ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!

భాగ్యనగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి ధర్మ ప్రచారయాత్ర..ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ ప్రచారయాత్ర హైదరాబాద్‌లో దిగ్విజయవంతంగా సాగుతోంది. ధర్మప్రచార యాత్రలో భాగంగా జూబ్లిహిల్స్ లోని జలవిహార్ రామరాజు దంపతుల నివాసంలో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు, అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, శుభాశీస్సులు అందజేశారు. రామరాజు నివాసంలో బస చేసిన స్వామివారిని సినీ దర్శకుడు, ఎస్వీబీసీ శ్రీనివాస్‌రెడ్డి, చెన్నై టీటీడీ బోర్డు మెంబర్ శే‌‌ఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీమంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి. ఇ. పెద్దిరెడ్డి వంటి ప్రముఖులు దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచారయాత్ర రెండు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.