Breaking News
Home / EVENTS / మెట్రో ప్రియులకు శుభవార్త..బర్త్ డే, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కు గ్రీన్ సిగ్నల్ !

మెట్రో ప్రియులకు శుభవార్త..బర్త్ డే, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కు గ్రీన్ సిగ్నల్ !

మెట్రో ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే మామోలుగా బాగా డబ్బు ఉన్నవారైనా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే బర్త్ డే, వెడ్డింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలి అనుకుంటారు. ఈమేరకు ఎక్కువ మొత్తంలో డబ్బులు కర్చుపెట్టి ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుంటారు. ఇక డబ్బు ఉన్నవారు అయితే ఏదైనా చెయ్యగలరు. ఇక తాజాగా నోయిడా మెట్రో రైల్ కార్పోరేషన్ వారు ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బర్త్ డే, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ వంటివి ఏమైనా ఉంటే ఇక నుండి మెట్రో లో చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. నోయిడా నుండి గ్రేటర్ నోయిడా వరకు వెళ్ళే ఈ ట్రైన్ లో 21 స్టేషన్ లు ఉంటాయి. ఈవెంట్ లో డ్రింకింగ్ కు అనుమతి లేదు. ఇక ఈవెంట్ కు 15రోజులు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. దీనికి లైసెన్స్ ఫీజుగా 5-10వేల వరకు ఉంటుంది. ఇక సేఫ్టీ డిపాజిట్ గా 20వేలు కట్టాలి. ఈ ప్రాసెస్ త్వరలోనే అమలు చేయనున్నామని ఎన్ఎంఆర్సీ ప్రకటించింది.