ఈ మద్య మరి దారుణంగా అబ్బాయిల మద్యం తాగి రచ్చ రచ్చ చేస్తున్నారు. పీకల దాకా మద్యం తాగిన నలుగురు కళాశాల విద్యార్థులు…మద్యం మత్తులో కాలేజీ అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. నలుగురు విద్యార్థులు మద్యం తాగి ఢిల్లీలోని శ్రీగురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల బాలికల హాస్టల్ లోకి వచ్చారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోగా వారితో ఘర్షణ పడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదుమేర పోలీసులు నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. అనుచితంగా ప్రవర్తించిన కళాశాల విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు.
