రాహుల్ గాంధీ త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకోబోతున్నారా? సోనియా గాంధీ నాయకత్వంపై పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా? ఈ ప్రశ్నలకు ఏఐసీసీ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. త్వరలో రాహుల్ పట్టాభిషేకం జరగబోతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్కు అప్పగించేందుకు పార్టీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. తొలుత దీనిపై రాహుల్ విముఖత చూపినా నాయకుల ఒత్తిడితో బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే, దీపావళి తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి.. అదే సమావేశంలో రాహుల్కు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల సమాచారం.
