గుజరాత్ ఎన్నికల తరుణంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి.. పటేళ్ల రిజర్వేషన్ పోరాట నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారనే కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన మూడు సీసీ టీవీ పుటేజ్‌లను ఓ జాతీయ ఛానెల్ ప్రసారం చేసింది. సీసీ టీవీ పుటేజ్‌ల ప్రకారం హార్దిక్ పటేల్ ఆదివారం రాత్రి ఓ హోటల్‌కు వెళ్లారు. ఆ హోటల్‌లోని రూమ్ నెం.222 నుంచి 12 గంటల 22 నిమిషాలపాటు బయటకు వచ్చారు. అయితే అక్కడే రాహుల్‌తో హార్దిక్ పటేల్ భేటీ అయ్యారని, సుమారు సుమారు 30 నిమిషాలసేపు వీరు సమావేశమయ్యారని, ఆ వీడియో పుటేజ్ ఆధారంగా కథనం ప్రసారమైంది. కాగా హార్దిక్ హోటల్‌కు వెళ్లిన మాట నిజమే అయినా.. కలిసింది వేరే నేతలనని, రాహుల్‌ను కాదని ఆయన సన్నిహితులు కౌంటర్ ఇస్తున్నారు.
