సోమవారం విడుదలైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీ పార్టీ నలబై నాలుగు స్థానాల్లో ,కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .అయితే బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టిన కానీ ఆ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తగిలింది .ఆ పార్టీ తరపున పోటి చేసిన ప్రముఖులిద్దరూ ఓడిపోయారు .
అందులో మొదట ఆ పార్టీ సీఎం అభ్యర్ధి అయిన ప్రేమ కుమార్ .ఇంకొకరు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ సింగ్ .సుజాన్ పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటిచేసిన ప్రేమ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేసిన రాజేందర్ రాణా చేతిలో మూడు వేల ఐదు వందలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు .ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన సత్పాల్ ఉనా నియోజక వర్గం నుండి పోటి చేసి కాంగ్రెస్ అభ్యర్ధి రైజడా చేతిలో మూడు వేల నూట తొంబై ఆరు ఓట్ల తేడాతో ఓడిపోయారు ..