Home / Uncategorized / కుంటాల జలపాతం తెలంగాణ పర్యాటక రంగానికే తలమానికం

కుంటాల జలపాతం తెలంగాణ పర్యాటక రంగానికే తలమానికం

కుంటాల జలపాతం తెలంగాణ పర్యాటక రంగానికే తలమానికం అని, అయితే అక్కడకు విహారం కోసం వచ్చే యువతీ, యువకులు ప్రమాదాల బారిన పడి చనిపోవటం చాలా బాధాకరం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  జోగు రామన్న  అన్నారు . కుంటాల వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకుల కోసం కనీస వసతి సౌకర్యాలు, వచ్చే సందర్శకులు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అరణ్య భవన్ లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.

see also :కాళేశ్వరంతో శనిగరం అనుసంధానం..!

దిలాబాద్ ను రెండవ కాశ్మీర్ గా పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీయార్ జిల్లాలో పర్యాటక అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. కుంటాల సహజ సౌందర్యం, అటవీ ప్రాంతం ఏ మాత్రం దెబ్బకుండా, పర్యావరణ హితమైన టూరిజంలో భాగంగా కుంటాల వాటర్ ఫాల్స్ దగ్గర అభివృద్ది పనులు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. జలపాతం ఎగువన ఉన్న గుండంలో పడి చాలా మంది చనిపోతున్నారని, అక్కడి ప్రమాదకర పరిస్థితుల వల్ల జలపాతంలో పడి ఇప్పటిదాకా 136 మంది చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నా యన్నారు.

see also :కూలీ పనికి వెళ్తున్న మహిళలతో నీళ్ల మంత్రి హరీశ్ ముచ్చట్లు

ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉండాలన్నారు. రామన్న స్పష్టం చేశారు. త్వరలోనే అధికారుల బృందం మరో సారి క్షేత్ర స్థాయిలో పర్యటించి, అభివృద్ది ప్రణాళికలు సిద్దం చేస్తారని, వేసవిలోనే పనులు పూర్తి అయ్యేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ( పీసీసీఎఫ్ ) పీ.కే. ఝా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat